10 March, 2026 | 3:32 AM

సమాజ సేవే మా లక్ష్యం : ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు

10-03-2026 01:47 AM

అయిజ మార్చి 9 : అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో శాంతినగర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవను చేశామని అధ్యాపకులు హర్ష కుమార్ అన్నారు.

ప్రోగ్రామ్ అధ్యక్షులు రాఘవేందర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు వేసవికాల శిబిరాన్ని 3 వరోజులో భాగంగా గ్రామంలోని మురికి కాలువలు తీసివేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, రోడ్లు శుభ్రం చేయడం మొదలగు పనులు చేశామని అన్నారు.గ్రామస్తుల సహాకారం ఉంటే సమాజ సేవ చేయడంలో ముందుంటామని,మరియు గ్రామంలో ని శుభ్రత పై అవగాహనా కార్యక్రమాలు చేపడితే గ్రామాలలో మార్పులు తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయమ్మ, భర్త వీరేష్, ఉప సర్పంచ్ రవి, అధ్యాపకులు ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.