14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

మన చూపు సరుకైంది!

09-02-2026 12:00 AM

ఇక్కడ

మన చూపు సరుకైంది,

మన అడుగు ఒక లాగ్

మన మాట

మార్కెట్‌కి చేరేలోపే

డేటాగా శుద్ధి అవుతుంది!


మనిషి ఇక్కడ

వినియోగదారుడు కాదు..

ముడిసరుకు

కళ్లలోని వెలుగు క్లిక్‌గా

మనసులోని తడబాటు 

ట్రెండ్‌గా మారుతుంది!


డేటా రాజ్యంలో

కాలం కూడా ఉచితం కాదు

మన నిద్ర లెక్క

మన మేల్కొలుపు అమ్మకం

మన భవిష్యత్తు

ఒక అంచనా మాత్రమే


అల్గరిథం

మన కోరికలకన్నా ముందే

మనల్ని తెలుసుకున్నట్టు నటిస్తుంది.

కానీ.. మన మౌనాన్ని 

చదవలేకపోతుంది


ఇక్కడ నిజం

అత్యధికంగా పంచబడినదే

అబద్ధం

అత్యంత లాభదాయకమైంది

మన సందేహాలు

మార్కెట్‌కు ధైర్యం

కానీ.. ఒక చోట

డేటా ఆగుతుంది

మనిషి తన్నుతానే 

ప్రశ్నించుకునే ఆ క్షణంలో..


ఆ క్షణం

కొనలేనిది

కోడింగ్ చేయలేనిది

విక్రయించలేనిది


డేటా రాజ్యం

మన అలవాట్లను నడిపించగలదు

మన జీవితాన్ని అంచనా వేయగలదు

కానీ, మన అర్థాన్ని కాదు !


ఎందుకంటే

సంఖ్యలు లాభాన్ని తెలుసుకుంటాయి

మనిషి మాత్రం

అర్థం కోసం జీవిస్తాడు.

 డాక్టర్ నూకరాజు బెందుకుర్తి