24 March, 2026 | 6:34 AM

ఉద్యోగుల క్షేమమే మా ప్రాధాన్యం

24-03-2026 01:43 AM
  1. విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబాలు వీధినపడొద్దు 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

ఇద్దరి కుటుంబాలకు రూ.కోటి చొప్పున బీమా చెక్‌లు అందజేత 

మానవీయ ఆలోచనతోనే ప్రమాద బీమా పథకం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి): విద్యుత్‌శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించినవారి కుటుంబా లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులు అంద జేశారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇతర మంత్రుల సమక్షంలో బాధితులకు చెక్కులు అందించారు.

మృతి చెందినవారి కుటుం బాలను ఆదుకునేందుకు ముందుకొ చ్చిన విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్కను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. విద్యు త్‌శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రా ణాలు కోల్పోయిన ఓర్సు సురేశ్, ముఖ్తార్ బేగ్ కుటుంబసభ్యులకు రూ.కోటి చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమి తిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు.

సీపెక్ సర్వే ప్రకారం తేలిన కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కుటుంబ పెద్ద మరణించి నప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదని కుటుంబ బీమా తీసుకొచ్చామని వివరించా రు. ఉద్యోగుల క్షేమమే తమ ప్రథమ ప్రధా న్యమని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుం బసభ్యుల్లో మనోధైర్యాన్ని నింపేందుకే అసెంబ్లీ సమావేశాల సమయంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లా డుతూ.. ఉద్యోగులకు ప్రమాద బీమా అనేది దేశ చరిత్రలోనే ఇదొక చారిత్రక కార్యక్ర మమని, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఇలాం టి నిస్సహాయ స్థితి రాకూడదన్న మానవీయ ఆలోచనతోనే, దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1.20 కోట్ల భారీ ప్రమాద బీమాను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు.

ఈ ప్రమాద బీమా పథకం ద్వారా విద్యుత్ సంస్థల్లోని 51 వేల మందికి పైగా, సింగరే ణిలోని 41 వేల మంది, రాష్ట్రంలోని ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షనర్లు 7.57 లక్షల మంది కుటుంబాల్లో ఈ పథకం భరోసాను కల్పి స్తుందని వివరించారు. ఈ క్రమంలోనే అసి స్టెంట్ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తూ 2025 అక్టోబర్ 10న మరణించిన వరుస సురేశ్,

మహబూబ్‌నగర్ సర్కిల్ సివిల్ విభా గంలో ఆర్టిజన్‌గా పనిచేస్తూ 2025 ఏప్రిల్ 19న మరణించిన ముక్తార్ బేగ్ కుటుం బాలకు రూ.కోటి చొప్పున బీమా చెక్కులను అందజేసి ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వ రరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్, ఆజారుద్దీన్, ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.