21 March, 2026 | 8:24 AM

ఎకో టూరిజం పనులు పరిశీలించిన కలెక్టర్

21-03-2026 12:00 AM

నిజాంసాగర్ మార్చి 20(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని  నిజాంసాగర్ ప్రాజెక్టు గోల్  బంగ్లావద్ద నిర్మిస్తున్న పర్యాటక శాఖ అభివృద్ధి ఎకో-టూరిజం ప్రాజెక్టు పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.

ప్రాజెక్టులో భాగంగా నిర్మాణంలో ఉన్న డీలక్స్ కాటేజీలు, సూట్ కాటేజీలు, స్పా & యోగా సెంటర్, మెయింటెనెన్స్ బ్లాక్ , రెస్టారెంట్ బ్లాక్ పనులను వేగవంతం చేసి రాబోయే వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అదనంగా, ప్రాజెక్టుకు సంబంధించిన ఎంట్రీ ఆర్చ్ కోసం తగిన స్థలాన్ని త్వరితగతిన ఖరారు చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఏ ఈ ఈ (టూరిజం), కాంట్రాక్టర్లు, తహసీల్దార్ బుజంగారావు, ఎం పి డి ఒ, స్థానిక నీటిపారుదల శాఖ అధికారులు , స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.