25 August, 2026 | 12:14 AM

Breaking News

విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే

24-08-2026 11:05 PM

గజ్వేల్: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీ మాతృమూర్తి బాషారత్ ఉన్నిసా బేగం ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవ రెడ్డి సోమవారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలోని విరాహత్ అలీ నివాసానికి చేరుకుని ఆయనను పరామర్శించారు. బాషారత్ ఉన్నిసా బేగం మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి వెంట మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్ గోలి మమత సంతోష్ తదితరులు ఉన్నారు.