9 August, 2026 | 4:06 AM

నా రియల్ ఫేస్ వాళ్లకు మాత్రమే తెలుసు!

09-08-2026 01:12 AM

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అగధ’. ‘మా ఊరి పొలిమేక’ తర్వాత కామాక్షి నుంచి వస్తోన్న ఈ హారర్ థ్రిల్ల్ప ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఎమ్‌ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్లో జోరు పెంచిన మేకర్స్ వరుస ఇంటర్వ్యూస్లో పాల్గొంటు సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే కామాక్షి షూటింగ్ అనుభవాలు పంచుకున్నారు. పర్టిక్యులర్గా కొన్ని సీన్స్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత భయం కలుగుతుందా అనే ప్రశ్నపై కామాక్షి స్పందిస్తూ.. ‘ఫస్ట్ సెట్లో తుక్కు తుక్కు 12 గంటలు వర్క్ చేసి అలిసిపోతాము. ఇక ఇంటికి వెళ్లగానే పడుకుంటాము.

ఇక భయడపే స్కోప్ ఎక్కడ ఉంది. ఫస్ట్ నీరసం వస్తుంది.. తర్వాత భయం వస్తుంది. సినిమాలో స్క్ప్రీ చూసినంత భయం, ఫీల్ సెట్లో మేము మా ఫెసుల్లో చూపిస్తాము. కానీ మాకు ఉండదు. ఎందుకంటే మా చుట్టు ఉన్న వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. లైట్స్, కెమెరా అంటూ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. కానీ అవేవి ఆడియన్స్కు కనిపించవు. ప్రేక్షకులకు కనిపించేది మా ముఖాలు మాత్రమే. ఆ టైమ్లో మేము యాక్టర్స్ అనేది ఒక్కటే మా బ్రెయిన్లో ఉంటుంది.

ఆడియన్స్కు అది ఎంతవరకు రీచ్ అవ్వాలి అనే దానిపై మా ఫోకస్ ఉంటుంది’ అని తెలిపింది. అలా సెట్ బయట విషయానికి వస్తే నేను చాలా చిల్ పర్సన్. మాది గోదావరి కాబట్టి నాకు కొంచెం ఎటకారం కూడా ఎక్కువే ఉంటుంది. కానీ నన్ను ఎవరు చూసిన మీనాక్షి చాలా కోపంగా ఉంటుంది అనుకుంటారు. కానీ వేరు వేరు క్యారెక్టర్స్ చేసి మా ముఖాలు ఇలా అయిపోతాయి కానీ, నా రియల్ ఫేస్ మాత్రం మా ఇంట్లో వాళ్లకు, ఫ్రెండ్స్, చుట్టాలు వీళ్లకు తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది.