3 September, 2026 | 2:05 AM

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్

03-09-2026 | 12:59am
  1. 15 రోజుల అమలు అనంతరం నూతన విధానంపై సమీక్ష
  2. క్షేత్రస్థాయిలో సీపీ సజ్జనార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలన
  3. రోడ్డు నెంబర్ 45పై ప్రత్యేక దృష్టి

జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 2 (విజయక్రాం తి): కేబీఆర్ పార్క్ (KBR Park)చుట్టూ ఆగస్టు 18న ప్రా రంభించిన నూతన వన్-వే ట్రాఫిక్ విధానం అమలులోకి వచ్చి 15 రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ (GHMC Commissioner RV Karnan) బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వాహనాల రాకపోకలను, అభివృద్ధి పనుల పురో గతిని పరిశీలించారు.

గత పక్షం రోజుల్లో గ మనించిన పలు అంశాలు, వాహనదారుల నుంచి వచ్చిన వివిధ సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ సం బంధిత విభాగాధికారులతో కలిసి వారు వి స్తృత తనిఖీలను చేపట్టారు. ఈ క్షేత్రస్థాయి తనిఖీ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం జా యింట్ సీపీ జోయెల్ డెవిస్, డీసీపీ ట్రాఫిక్ కాజల్ సింగ్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితే ష్ వి.పాటిల్ పాటు పలు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాటిల్ నెక్ ప్రాంతాల గుర్తింపు

ఈ పర్యటనలో భాగంగా అధికారులు ప్ర ధానంగా ఫిలింనగర్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ కూడళ్ల వద్ద క్షేత్రస్థాయి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ఆ యా జంక్షన్ల వద్ద వాహనాలు ఆటంకం లేకు ండా సాఫీగా సాగిపోయేలా చేపట్టాల్సిన ది ద్దుబాటు చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 

వాహనాల వేగం మందగిస్తున్న బా టిల్ నెక్ (రద్దీ) ప్రాంతాలను గుర్తించి, రహదారులను మరింతగా విస్తరిస్తే ట్రాఫిక్కు ఎ లాంటి అంతరాయం కలగకుండా రాకపోక లు నిరంతరాయంగా సాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. వెంటనే రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, రద్దీ అధికంగా ఉన్న చోట్ల రహదారుల మరమ్మతు లు పూర్తి చేసి డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

ఫిలింనగర్ రోడ్ నంబర్ 45 మార్గంపై ప్రత్యేక దృష్టి..

ఫిలింనగర్ జంక్షన్ నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ మధ్య వాహనాల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకు ప్రాధాన్యతా క్రమంలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మార్గంలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలు, నీటి సరఫరా, డ్రైనేజీ తదితర యుటిలిటీ లైన్లను యుద్ధప్రాతిపదికన ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలను సీపీ, జిహెచ్‌ఎంసీ కమిషనర్ జారీ చేశారు.  

ప్రజల సహకారానికి ధన్యవాదాలు

హైదరాబాద్ నగర సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న హెచ్-సిటీ ప్రాజెక్టు ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం ఈ వన్-వే విధానాన్ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నూతన అమల్లో నగరవాసులు, వాహనదారులు ఎంతో బాధ్యతాయుతంగా సహకరిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ఆర్వి కర్ణన్ నగర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.