1 May, 2026 | 10:53 PM

Breaking News

మండలాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి   •   ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు   •   హనుమాన్ మాలాదారుల గిరిప్రదక్షిణ   •   సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే   •   మాజీ మంత్రి పువ్వాడను కలిసిన సోయం వీరభద్రం   •   ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దీప కాసరగడ్డ   •   కలం కార్మికులే సమాజానికి దిక్సూచి   •   రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే   •   ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి   •   మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల పరిరక్షణకై పోరాటాలు ఉదృతం చేయాలి   •  

వేసవి క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

01-05-2026 02:12 AM

గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశి రాం నాయక్

మహాబాబాబాద్, ఏప్రిల్ 30, (విజయక్రాంతి): చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం పొందడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారి దేశీ రామ్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం కొత్తగూడ మోడల్ స్పోరట్స్ స్కూల్ నందు నిర్వహించబడుతున్న వేసవికాలం క్రీడా శిబిరాన్ని ఆయన సందర్శించారు.

కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్, హ్యాండ్ బాల్, బాస్కెట్బాల్ క్రీడల్లో శిక్షణ ఇచ్చే వ్యాయమ ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అలాగే పాఠశాల నుండి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలో పాల్గొనీ  మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న  విద్యార్థులను  అభినందించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ ఏ టి డి ఓ భాస్కర్, హెడ్మాస్టర్ సారయ్య , స్పోరట్స్ ఆఫీసర్ కొమ్మాలు, దేవిలాల్ తదితరులు పాల్గొన్నారు.