గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలి
సర్పంచ్ రవీందర్ నాయక్
మఠంపల్లి,(విజయక్రాంతి): పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న ఉచిత టీకాల కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మఠంపల్లి మండలంలోని చెన్నాయి పాలెం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ అన్నారు. సోమవారం పశువైద్య & పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధికి పశు సంపద, పశువుల ఆరోగ్యం అత్యంత కీలకమని అన్నారు.
పశువులకు టీకాలు వేయించడం ద్వారా వ్యాధులను ముందుగానే నివారించి,పశు సంపదను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాణోతు రాంబాయి నాగు నాయక్,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాలోతు పున్నా నాయక్, వార్డు సభ్యులు పశువైద్య అధికారులు,సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు,పాడి రైతులు పాల్గొన్నారు.




