విద్యార్థుల్లో పరిమళించిన మానవత్వం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జబ్బుపడిన ఇద్దరు చిన్నారులకు వైద్య ఖర్చులకోసం విద్యార్థులు సేకరించిన విరాళాన్ని అందజేసినా వారి మానవత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. పట్టణంలోని టేకుల బస్తి కి చెందిన కళ్యాణ్ రాజ్, కృష్ణవేణి దంపతుల పిల్లలు శివ సహస్ర, మహావీర్ లు ఎస్ఎంఎ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి నయం కావడానికి వీరిద్దరికీ రూ.32 కోట్ల ఆర్థిక సహాయం అవసరం ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఈ చిన్నారుల వైద్యం కోసం బెల్లంపల్లి మండలం పెద్దబూద గ్రామానికి చెందిన విద్యార్థులు చందాలు జమ చేశారు. శివ సహస్ర మహావీర్ల ఫోటోలు ఉన్న బ్యానర్ చేత పట్టుకుని తిరుగుతూ రూ.10000 జమ చేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని చిన్నారుల తల్లిదండ్రులు కళ్యాణ్ రాజ్ కృష్ణవేణి లకు అందజేశారు. ఈ చందాలు వసూలు చేసిన చిన్నారుల్లో రామ్ చరణ్,అనిల్ కుమార్, అంకిత్, అనిల్, అశ్విత్ జస్వంత్, రాకేష్, విష్ణు, సాయి చరణ్ ఉన్నారు. ఈ చిన్నారుల్లో వికసించిన మానవత్వాన్ని అందరూ ప్రశంసించారు.




