ఆస్తి నేరాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి
ఏ.సి.పి.వసుంధర
సత్తుపల్లి, జూన్7 (విజయ క్రాంతి): ఆస్తి నేరాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, కల్లూరు డివిజన్ ఏసిపి వసుంధర యాదవ్ అన్నారు. ఇటీవల కాలంలో గృహ చోరీలు,రాత్రివేళ దొంగతనాలు, ఇతర ఆస్తి సంబంధిత నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కల్లూరు డివిజన్ పోలీసు శాఖ ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు తెలియజేస్తుందని వసుంధర యాదవ్ అన్నారు. ప్రతి పౌరుడు తమ ఇల్లు, కుటుంబం ,విలువైన ఆస్తుల రక్షణ కోసం జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు, రాత్రి నిద్రించే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా తాళం వేసి ఉన్నాయో నిర్ధారించుకోవాలనీ, ఇంట్లో అధిక మొత్తంలో నగదు, బంగారం ఇతర విలువైన వస్తువులు నిల్వఉంచకుండా బ్యాంకు లాకర్లను వినియోగించాలనీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపించిన వెంటనే, సమీప పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలని సమీప పోలీసు స్టేషన్కు , డయల్-100 కు సమాచారం అందించాలని అన్నారు.
బయట ప్రాంతాలకు వెళ్లే సమ యంలో పొరుగువారికి, బంధువులకు సమాచారం ఇవ్వాలని, ముందస్తు జాగ్రత్త లు తీసుకోవడం అప్రమత్తంగా ఉండడం వలన ఆర్థిక నేరాలు జరగకుండా నిరోధించ వచ్చని అన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేక నైట్ పెట్రోలింగ్, గ్రామాలు, కాలనీలు ప్రధాన రహదారులపై మొబైల్ పెట్రోలింగ్,నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై ప్రత్యేక నిఘా, సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, సాంకేతిక ఆధా రాల సేకరణ, నేర ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని వసుంధర యాదవ్ అన్నారు.






