2 July, 2026 | 2:51 AM

వన్ డే వన్ వార్డ్

02-07-2026 01:30 AM

కూకట్ పల్లి, జులై 1 (విజయక్రాంతి): వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం లో భాగంగా బుధవారం కూకట్ పల్లి సర్కిల్ కూకట్ పల్లి డివిజన్ శేషాద్రి నగర్ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలు, అసోసియేషన్ ల సభ్యులు, ప్రజలతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీలలో నీరు నిలిచే ప్రాంతాలను, ఇతరత్రా సమస్యలు ఉన్న ప్రాంతాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. విద్యుత్ దీపాలు వెలగనిచోట వెంటనే లైట్లు అమర్చాలని, పాఠశాలల ముందు నీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించి తొలగించాలని  డ్రైనేజ్ సమస్యలు వంటి వాటిని సంబంధిత అధికారులు పరిష్కరించాలని సూచించారు. రహదారిపై ట్రాఫిక్ లాంటి సమస్యలను ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.