23 April, 2026 | 10:30 AM

చెక్ బౌన్స్ కేసులో ఒకరు ఆత్మహత్య

23-04-2026 12:00 AM

సూసైడ్ నోట్‌లో పోలీసులతో సహా 

పలువురిపై వేధింపుల ఆరోపణలు

పోలీసుల తీరుపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

మృతదేహంతో బోడ యాదగిరి ఇంటి ఎదుట ధర్నా

ఎల్బీనగర్, ఏప్రిల్ 21: చెక్ బౌన్స్ కేసులో హింసించారని ఓ కాలనీ అధ్యక్షుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియా కాలనీలో వెలుగులోకి వచ్చింది. లక్ష్మీప్రియ కాలనీ అధ్యక్షుడు మధు చెక్ బౌన్స్ కేసు విషయంలో పోలీసులు, అలాగే బోడ యాదగిరి అనే వ్యక్తి వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు మధు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు .. సూర్యపేట జిల్లా నూతన్ కల్ మండలానికి చెందిన దూడిగం మధుసూదన్ (49), భార్య వినోద, కుమార్తె ఇందు, కుమారుడు సాయితో కలిసి నగరానికి వచ్చి హయత్నగర్ డివిజన్ లోని లక్ష్మిప్రియా కాలనీలో స్థిరపడ్డారు. మధుసూదన్ వృత్తిరీత్యా కారు డ్రైవర్ గా పనిచేస్తూ లక్ష్మిప్రియా కాలనీకి అధ్యక్షుడిగా పదవీలో కొనసాగుతున్నాడు.

కాగా, ఇటీవల నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో మధును ఒక కేసు విషయంలో బెయిల్, ఎంక్వైరీ  విష యం అని అక్కడి నుంచి పోలీసులు తీసుకువచ్చి వేధించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల కారణంగానే మధు ఆత్మహత్య నిర్ణయం తీసుకు న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన మరణానికి బోడ యాదగిరి, అతని తమ్ము డు రమణ, అలాగే పోలీసులు కారణమని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కేవలం రజకుడని ఉద్దేశంతో ఇలాం టి వేధింపులకు పాల్పడ్డారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఇద్దరి పేర్లు కూడా లేఖలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు, స్థానికులు యాదగిరి ఇంటి ఎదుట మధు మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యు లు, బంధువులు ఆందోళన చేపట్టారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాడు. మధు ఆత్మహత్యకు పూర్తి కారణాలు, వివరాలు తెలియాల్సి ఉందని హయత్ నగర్ పోలీసులు తెలిపారు.