6 May, 2026 | 7:09 PM

కొలువుదీరిన పిఎసిఎస్ పాత కార్యవర్గం

06-05-2026 06:17 PM

సంఘంలో బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ (జె.ఎస్)

గరిడేపల్లి,(విజయకాంత్రి): హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాత కార్యవర్గం బుధవారం మరోసారి కొలువు తీరింది.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కమిటీలు రెండు నెలల క్రితం రద్దు అయిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల హైకోర్టు పాత కమిటీలను కొనసాగిస్తూ సహకార సంఘాల బాధ్యత నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంతో కీతవారిగూడెం పాత పాలకవర్గం నూతనంగా బాధ్యతలు స్వీకరించింది.