అసంపూర్తి అభివృద్ధి అస్తవ్యస్తం పనులు
చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని నేషనల్ హైవే పక్కన చేర్యాల బైపాస్ రోడ్డు లో వెల్లే శ్రీనగర్ కాలనీ మలుపు వద్ద మంగళవారం అర్ధ రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గత మూడు సంవత్సరాలనుండి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలో పడిపోయింది. డ్రైనేజీ నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడం సరైన సూచిక బోర్డు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడ్డాక ఈ మలుపు వద్ద వాహనాల రాకపోకలకు ఇది పెద్ద ఆటంకంగా మారింది.
ఈ ప్రాంతంలో తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి భద్రతా చర్యలు చేపట్టాలని,పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికైనా సంబందించిన అధికారులు నిర్లక్ష్యం వీడి అసంపూర్తిగా కూడిన పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.






