మొక్కల సంరక్షణ అందరి బాధ్యత: చైర్మన్ జాబరె పెంటయ్య
01-07-2026 03:20 PM
వాంకిడి,(విజయక్రాంతి): నాటిన మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని, వాంకిడి ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ జాబరె పెంటయ్య సూచించారు. వాంకిడి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం ఆవరణలో స్థానిక సర్పంచ్ సి.హెచ్ సతీష్ తో కలిసి బుధవారం ఆయన మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారం లో భాగంగా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. నాటిన మొక్కలు చెట్టుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.






