29 April, 2026 | 8:11 PM

Breaking News

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక   •   అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలి   •   అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   సుల్తానాబాద్ మండలంలో 10 ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రభంజనం   •   పదవ తరగతి ఫలితాలలో ఎస్వీ విద్యార్థుల ప్రభంజనం   •   పది ఫలితాలలో భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యార్థినుల విజయకేతనం   •   పేదింటి ఆడబిడ్డకు అండగా మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు   •   సోనాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు బాలికలు   •   పది ఫలితాల్లో 91.8శాతం ఉత్తీర్ణత   •   సీనియర్ అసిస్టెంట్ యాదగిరి సార్ సేవలు మరువలేం   •  

ఆయిల్ ట్యాంకర్, కంటెయినర్ ఢీ

28-11-2025 12:25 AM

-ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం

-మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన

హన్వాడ, నవంబర్ 27: ఆయిల్ ట్యాంకర్, స్టీల్ కంటెయినర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్ పేలి, ఆ వాహ న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఎన్‌హెచ్ 167 ప్రధాన రోడ్డుపై, పల్లెమునికాలనీ వద్ద జరిగింది.

వాహనాలు ఎదురుగా ఢీ కొనడంతో ఆయిల్ ట్యాంక్ పేలి భారీగా మంటలు వ్యాపించాయి. గమనించిన పల్లెమోని కాలనీ యువకుడు శ్రీశైలం డయల్ 100కు సమాచారం అందిం చాడు. అప్పటికే ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ ఆ మంటల్లో సజీవ దహనమయ్యాడు. కంటెయి నర్ డ్రైవర్‌ను శ్రీశైలం కాపాడాడు. కేసు దర్యా ప్తు చేస్తున్నామని హన్వాడ ఎస్సై తెలిపారు.