23 June, 2026 | 10:04 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

పిడుగుపాటుకు గురై గొర్రెల కాపరి మృతి

23-06-2026 08:56 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ గొర్రెల కాపరి మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... వట్టిమర్తి గ్రామానికి చెందిన సంక బుడ్డి నాగరాజు (32) సోమవారం మధ్యాహ్నం దాడి శ్రీనివాస్‌కు చెందిన వ్యవసాయ భూమిలో గొర్రెలు మేపుతున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య సంక బుడ్డి మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు చిట్యాల ఎస్సై ఎం. రవికుమార్ తెలిపారు. నాగరాజు మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.