2 July, 2026 | 3:40 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

సమయపాలన పాటించని అధికారులకు శాఖ పరమైన చర్యలు తప్పవు

05-05-2026 03:28 PM

నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఆ సమయంలో అధికారులు ఎవరు సమయానికి రాకపోగా అధికారుల కోసం ప్రజలు ఎదురు చూడటాన్ని కలెక్టర్ అధికారుల అలసత్వంపై ఆగ్రహానికి లోనయ్యారు. సమయానికి విధులకు హాజరు కాని అధికారులు, సిబ్బందిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆలస్యంగా వచ్చిన అధికారులకు షోకాస్ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారుల ఆదేశించారు. ప్రజలకు సేవలు అందించే బాధ్యతతో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించిన ఆయన, నిర్లక్ష్యం, ఆలస్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా వేగవంతంగా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.