జువెలరీ షాపు యజమానులు పోలీసులకు సహకరించాలి
మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ సింగ్
ప్రతి బ్యాంకు, జ్యువెలరీ షాపు ముందు పటిష్టంగా సీసీ కెమెరాలను బిగించుకోవాలి,
బంగారము అమ్మిన వ్యక్తుల నుండి ఐడిని సేకరించాలి.
ముఖ్యంగా సిసి కెమెరాలు పవర్ ఆన్ లో ఉంచాలి.
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని తూప్రాన్ పట్టణంలోని మమత ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కరీంనగర్ జువెలరీ షాప్ లో జరిగిన చోరీ కేసు విషయంలో తూప్రాన్ పట్టణ కేంద్రంలోని ప్రధాన బ్యాంకు అధికారులు, జెవెలరీ షాప్ యజమానులు పాన్ బోకర్స్ ఈ కార్యక్రమానికి పిలిచి జిల్లా ఎస్పీ అవగాహన కల్పించారు.
ముఖ్యంగా ప్రతి బ్యాంకు అధికారులు పటిష్టంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అంతేకాదు ముఖ్యంగా ప్రతి సీసీ కెమెరా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా సీసీ కెమెరాలను పవర్ ఆఫ్ లో ఉంచరాదని సూచించారు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని వారు తెలుపుతూ మనమందరము కలిసికట్టుగా ఉంటే దొంగతనాలను అరికట్టవచ్చని తెలిపారు.
ఎవరైనా అపరిచితులు బంగారం తాకట్టు పెట్టినప్పుడు జూలరి షాపు యజమానులు ఒక రిజిస్టర్ బుక్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని అపరిచిత వ్యక్తులు బంగారం అమ్మదలచినప్పుడు వారి ఆధార్ కార్డు, లేక ఓటర్ ఐడి కార్డ్ మరియు ఫోన్ నెంబర్లను ఒక డైరీలో రాసుకోవాలని తెలిపారు, ముఖ్యంగా బయోమెట్రిక్, సైరన్ సౌండ్ ను అమర్చుకోవాలనీ మాండేటరీని సెట్ చేసుకోవాలన్నారు. స్టోరేజీ బంగారం, వెండి నగలను ఐసోలేషన్ లో నిలువ చేసుకోవాలన్నారు, మరి ముఖ్యంగా రాత్రుల్లో జూవలరి షాప్ ముందు బ్యాంకుల ముందు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అంతే కాకుండా జ్యువలరీ యాజమాన్యం అసోసియేషన్ కమిటీని ఏర్పాటు చేసు కోవాలన్నారు. ఎవరైనా సరే దొంగ బంగారం కొన్న అమ్మిన జవెల్లరీ షాపు యజమానులకు సైతం కేసులు బుక్ చేసి వారిని రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ మాదిరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి వాడాలన్నారు. కారు నడిపే వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణం కొనసాగించాలన్నారు.
మరి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు, ఒక ప్రమాదం వలన రెండు కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ పరిధిలో ఉన్న అపరిచితుల వ్యక్తులు మాకేం పట్టి అని అనకుండా ప్రమాదం జరిగిన వ్యక్తిని తక్షణమే సమీప దవఖానాలో చేర్పించాలన్నారు ఈ విషయంలో ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని ప్రమాదం జరిగిన వ్యక్తులను అపరిచితులు కాపాడినట్లయితే వారికి ప్రభుత్వం నుండి 25 వేల పారితోషికం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పి, సిఐ, రామాయంపేట సిఐ, నర్సాపూర్ సిఐ, తూప్రాన్, మనోహరాబాద్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






