27 May, 2026 | 1:37 AM

ఘనంగా ఆత్మ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం

27-05-2026 12:00 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాని కృతజ్ఞతలు

బోయినపల్లి: మే 26 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలానికి చెందిన ఆరుగురు రైతులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రైతు ఆత్మ కమిటీలో చోటు దక్కింది. ఈ ఆరుగురు రైతులు మంగళవారం వేములవాడ లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. కోరెం కు చెందిన రైతు చంద్రగిరి తిరుపతి, గుడి శ్రీనివాస్ రెడ్డి, గుంటి తిరుపతి, రాజ్యలక్ష్మి, పద్మ, సిహెచ్ పద్మలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు, మండల కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన ఆత్మ కమిటీ నూతన సభ్యుల ప్రమాణ స్వీకరణ వేడుకకు బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మనబోయిన సువీన్ యాదవ్  హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సువీన్ యాదవ్ తో పాటు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్ , వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి , సర్పంచులు కనకయ్య,మోహన్ నాయికులు రమణ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సువీన్ యాదవ్ మాట్లాడుతూ.. చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో, పార్టీ కోసం నిరంతరం శ్రమించే నిబద్ధత గల కార్యకర్తలకు ఆత్మ కమిటీలో పదవులు దక్క డం హర్షణీయమన్నారు. నూతన సభ్యులు రైతులకు, ప్రభుత్వానికి నడుమ వారధిలా ఉంటూ వ్యవసాయ రంగ ప్రగతికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదవులు పొందిన వారు మండల ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.