30 May, 2026 | 4:30 PM

సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ డే కార్యక్రమంపై అధికారుల సమావేశం

30-05-2026 03:46 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ బస్తీలు మరియు స్లమ్ ప్రాంతాల్లో పౌర హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ డే కార్యక్రమం శుక్రవారం సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించారు. బాలానగర్ తహసీల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పౌర హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ నాయకులు హాజరై పౌర హక్కుల పరిరక్షణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.