9 April, 2026 | 1:14 PM

ఉపాధి హామీ పనులను పరిశీలించిన అధికారులు

09-04-2026 11:23 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మార్తిడి గ్రామ పంచాయతీ యందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఏపీవో రాజన్న పరిశీలించారు. సందర్శించి కూలీలకు సూచనలు వారి హాజరు గురించి దగ్గర ఉండి పరిశీలించారు. అర్హులైన కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని తెలిపారు. కూలీలకు త్రాగునీరు, వసతులు కల్పించాలని తెలిపారు.వారి వెంట కార్యదర్శి, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.