13 March, 2026 | 8:42 PM

పది పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

13-03-2026 06:23 PM

కడెం,(విజయక్రాంతి): నేటి నుండి జరగబోయే పదవ తరగతి (SSC) పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కడెం తాసిల్దార్ లచ్చిరాం, ఎంఈఓ షేక్ హుస్సేన్, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వారి వెంట మండల గిర్దావర్ శారద, సీనియర్ అసిస్టెంట్ ఎస్ గంగన్న పాల్గొన్నారు.