calender_icon.png 17 February, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల పనులు పరిశీలించిన అధికారులు

17-02-2026 02:03:42 PM

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మండల అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, నర్సరీలు పరిశీలించారు. మండలంలోని మేడమ్ పల్లి, సుర్జాపూర్, మస్కాపూర్, బాదన్ కుర్తి, గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల పనులను ఎంపీడీవో బి. రమాకాంత్ ,ఎంపీ ఓ సి హెచ్ రత్నాకర్ రావులు పరిశీలించారు .ఈ మేరకు ఇండ్ల నిర్మాణం వేగంగా జరగాలని లబ్ధిదారులకు, మేస్త్రీలకు సూచించారు. వీరి వెంట ఆ గ్రామాల సర్పంచులు రాజు, వెంకట్ రాములు, పార్శపు శ్రీనివాస్ ,ధోనికేని లక్ష్మీ, సెక్రటరీలు తదితరులు ఉన్నారు.