కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఊకే బుచ్చయ్య నియామకం
గుండాల, (విజయక్రాంతి): గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా(Congress Mandal President) ఊకే బుచ్చయ్య నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికార ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషితో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుండే తత్వాన్ని గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతలను అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన నియామకంపై ఊకే బుచ్చయ్య హర్షం వ్యక్తం చేశారు.
తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వానికి, రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని బుచ్చయ్య తెలిపారు. ప్రభుత్వ పాలనను, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మండలంలోని ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని భరోసాని ఇచ్చారు. ఆయన నియామకం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.






