22 August, 2026 | 2:19 AM

అక్రమ మట్టి తవ్వకం.. మూడు ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం

22-08-2026 01:38 AM

ఎర్రవల్లి, ఆగస్టు 21: కరుపాకుల గ్రామ శివారులో అనుమ తులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, జేసీబీని కోదండాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్లూ కోల్ట్ సిబ్బంది పెట్రోలింగ్లో అక్రమ తవ్వకం గుర్తించి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్లు ఎలాంటి అనుమతి పత్రాలు చూపించలేకపోయారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్త్స్ర వి. శ్రీనివాసులు తెలిపారు. అక్రమ మట్టి, ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.