15 June, 2026 | 8:57 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం మధ్యాహ్న భోజనంలో వడ్డించాలి

12-06-2026 04:21 PM

- నేరేడుచర్ల ఎం.ఈ.వో. బాలు

నేరేడుచర్ల: పీఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ నేరేడుచర్ల నందు మండల పరిధి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు.మధు,ఎల్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణపై ఉన్నత, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీ వారికి మధ్యాహ్న భోజన నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంఈఓ ఎం బాలు మాట్లాడుతూ, విద్యార్థులకు పోషకాలు, నాణ్యతతో కూడిన ఆహారం రుచికరంగా తయారుచేసి వడ్డించాలని, పాఠశాలలు ప్రారంభమవుతున్నందున వంట సామగ్రి, వంటగది పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని మంచినీటి ట్యాంకుల శుభ్రతకోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు.