9 April, 2026 | 3:41 PM

దమ్మపేట పంచాయతీ కార్యాలయంలో న్యూట్రిషన్ కమిటీ సమావేశం

09-04-2026 01:45 PM

దమ్మపేట,(విజయక్రాంతి): విలేజ్ హెల్త్ శానిటేషన్ & న్యూట్రిషన్ కమిటీ సమావేశం దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు అధ్యక్షతన గురువారం జరిగింది.  ఈ సమావేశంలో పాల్గొన్న పంచాయతి కార్యదర్శి బండి అనంత కుమార్ మాట్లాడుతూ ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహార సమస్యలపై చర్చించి పరిష్కార దిశగా ఆశాలు, ఎ.ఎన్.ఎం లు, అంగన్వాడి టీచర్ లు, పంచాయతీ సభ్యులు సమన్వయం తో పనిచేయాలని, ప్రభుత్వం ప్రజలకు అన్నివిధాల సౌకర్యాలు కల్పిస్తుందని, వాటిని ప్రజలకు చేరే విధంగా పనిచేయాలన్నారు. మహిళలు వారికుండే సమస్యలను అవగాహనతో పరిష్కరించుకొని ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం బాగున్నట్లేనని, రానున్న రోజుల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుతో మరిన్నీ విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలు రానున్నాయన్నారు.

గర్భిణీలు రక్తహీనత లోపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సి.పి.ఆర్ ఎలా చేయాలి, ఎండాకాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు, బాల్యవివాహాలు అరికట్టడం, ఇంటి వద్దే ఓ.ఆర్.ఎస్ తయారి విధానం, గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్, ప్రసవం తర్వాత తదుపరి గర్భధారణకు తీసుకోవాల్సిన గ్యాప్, వ్యక్తిగత శుభ్రత లేకపోవడం వలన క్యాన్సర్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితులను ఆశా వర్కర్ గవర రజని తెలియజేశారు. సర్పంచ్ రమాదేవి మాట్లాడుతూ కరోనా కాలంలో ఇంటి వద్దే మంచి ఆహరం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మనము ఎలా ఆరోగ్యాన్నీ కాపాడుకున్నామో గర్భిణీలు, బాలింతలు, యుక్త వయస్సు బాలికలు, మహిళలు మంచి ఆహరం తీసుకుంటూ రక్తహీనత లోపించకుండా జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.   ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, ఉయ్యాల లక్ష్మినారాయణ, పసుమర్తి కుసుమాంబ, రూపా రాంబాబు, ఆశాలు, ఎ.ఎన్.ఎం లు, అంగన్వాడి టీచర్ లు, గర్భిణీలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.