26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

09-04-2026 01:42 PM

కోహెడ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కోహెడ ఎన్టీఆర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)ను పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా వరుసగా కార్యక్రమన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత అంశాలతో పాటుగా.. భారత రాజ్యాంగం గురించి విద్యార్థులకు అవగాహన పెంపొందించుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఏం దర్శనాల నారాయణ ఉపాధ్యాయులు గీత, శోభ, తిరుమల విద్యార్థులు పాల్గొన్నారు.