11 May, 2026 | 1:27 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

నిబంధనకు లోబడే నామినేషన్ పత్రాలను పరిశీలించాలి..

03-12-2025 08:23 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల  నామినేషన్ పత్రాలను నిబంధనలకు లోబడి పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని బెల్లంపల్లి మండలంలోని బూదకుర్ద్, చాకేపల్లి గ్రామాలకు బూదకుర్ద్ గ్రామ పంచాయతీలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

నామినేషన్ ప్రక్రియ నుండి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్, నామినేషన్ల పరిశీలన, పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా, పోస్టల్ బ్యాలెట్ పంపిణీ, ఫోటో ఓటర్ స్లిప్పుల పంపిణీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, ఓటింగ్ నిర్వహణ ప్రక్రియ, ఫలితాలు వంటి ప్రతి అంశంపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్లు పరిశీలించి అర్హులు, అనర్హుల జాబితా పూర్తి వివరాలతో రూపొందించాలని తెలిపారు. ఎన్నికల గుర్తుల కేటాయింపులో జాగ్రత్త వహించాలని, విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని వెల్లడించారు.

కేజీబీవీ పాఠశాల విజిట్..

అంతకు ముందు బెల్లంపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యాలయం పరిధిలో చేపట్టిన అదనపు గదుల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బెల్లంపల్లి మండల పరిషత్ అధికారి మహేందర్ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.