21 March, 2026 | 1:35 AM

ఫిట్‌గా ఉంటేనే ఎన్‌వోసీ

21-03-2026 12:00 AM

కొలంబో, మార్చి 20 : ఐపీఎల్ 19వ సీజన్‌కు ఇంకా వారం రోజులే టై ముంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లతో ప్రిపరేషన్ క్యాంపులు నిర్వహిస్తూ బిజీగా ఉన్నాయి. అయితే శ్రీలంక క్రికెటర్లు ఇంకా భారత్‌కు రాలే దు. పతిరణ, హసరంగా, తుషారా వంటి ప్లే యర్స్ విషయంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీల క నిర్ణయం తీసుకుంది. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్, గాయాల దృష్ట్యా వీరందరికీ ముం దు ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించి ఆ తర్వాతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

దీని ప్రకారం వచ్చే వారం ఐపీఎల్ కాం ట్రాక్టులు ఉన్న తమ ఆటగాళ్లందరికీ లంక బోర్డు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి పరిశీలించనుంది. అయితే మతీష పతిరణ మాత్రం ఇప్పటికే ఫిట్ నెస్ సాధించినట్టు సమాచారం. టీ20 ప్రపంచ కప్ మధ్యలో పతిరణ గాయపడ్డా డు. ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ ఆడేందుకు పతిరణ సిద్ధమయ్యాడు. మలింగా స్టైల్‌లో బౌలింగ్ చేసే పతిరణ 2022లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ కే ప్రాతినిథ్యం వహించిన ఈ లంక యువ పేసర్ ధోనీ కెప్టెన్సీలో మరింత రాటుదేలాడు. గత ఏడాది జరిగిన మినీ వేలంలో పతిరణను కేకేఆర్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.