30 April, 2026 | 3:22 AM

పదవ తరగతి ఫలితాల్లో నోబుల్ స్కూల్ విజయభేరి

30-04-2026 02:07 AM

కందుకూరు, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో కందుకూరు మండల కేంద్రంలోని నోబుల్ స్కూల్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి తమ విజయభేరిని చాటారు.

పాఠశాల ప్రిన్సిపాల్ బైరు కొండల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది పాఠశాల నుండి 59 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి. గోల్కొండ సుష్మిత 576 ప్రథమ (స్కూల్ టాపర్), చందా శ్రీకాంత్ 575 ద్వితీయ, కాశ యశ్వంత్ 571 తృతీయ, ఉపాధ్యాయుల హర్షం.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు మంచి కీర్తిని తీసుకువచ్చారని కొనియాడారు.

విద్యార్థుల కష్టానికి, ఉపాధ్యాయ బృందం యొక్క నిరంతర కృషి తోడవ్వడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయ బృందం శుభాకాంక్షలు తెలుపుతూ, వారి పైచదువుల్లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.