30 April, 2026 | 4:30 AM

నేదునూరు ఆదర్శ పాఠశాలలో ప్రభంజనం

30-04-2026 02:09 AM

కందుకూరు, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మండల పరిధిలోని నేదునూరు ఆదర్శ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఆదర్శ పాఠశాలలో 96% పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించడం ఆనందదాయకమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ విష్ణు ప్రియ ఒక ప్రకటనలో తెలిపారు.

మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో తమ పాఠశాల నుండి 99 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 95 మంది విద్యార్థులు ఉత్తీర్ణులుగా సాధించినట్లు ఆమె తెలియజేశారు. తమ పాఠశాలలో 600 మార్కులకు గాను 550 మార్కులు సాధించి న విద్యార్థి తల్లోజు శ్రీవల్లి చంచల మైని తేజస్విని, కొరిమి భవానిలకు 527 మార్కులు వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మోడల్ పాఠశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థిని -విద్యార్థులు అంచలంచలుగా ఎదిగి తమతమ భవిష్యత్తులకు పునాదులు వేసుకుంటున్నారని ఆమె కొనియాడారు. దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచనపరంగా తమ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి మంచి భవిష్యత్తు కల్పించి వారిని తీర్చిదిద్దడంలో తమతో పాటు కృతర్థులు కావాలని ఆమె పిలుపునిచ్చారు.