డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఇకపై సహాయ నిరాకరణ
సంచలన నిర్ణయం ప్రకటించిన ఫిల్మ్ ఫెడరేషన్
ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపై డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సహాయం చేయబోమంటూ లేఖ విడుదల చేసింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై అంసతృప్తే ఈ తాజాగా నిర్ణయానికి కారణమని ఫెడరేషన్ విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
“ప్రముఖ నటుడు చిరంజీవితోపాటు ఫెడరేషన్‌లో, ఫిల్మ్ ఛాంబర్‌లో తీసుకున్న నిర్ణయాలను ధిక్కరిస్తూ సుమలత ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసిన సభ్యులను కలుపుకొని వెళ్లాలని కౌన్సి ల్ సమావేశంలో అందరం నిర్ణయం తీసుకున్నాం. వాళ్లను తిరిగి అసోసియేషన్‌లోకి తీసుకునేలా అవకాశం కల్పించాలని సూచించాం.
ఫెడరేషన్ ఆదేశాలను పాటించనందువల్ల డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఇక నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించదు. అసోసియేషన్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎలాంటి బాధ్యతనూ తీసుకోదు. ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే వేతనాల అగ్రిమెంట్ విషయంలో ఫెడరేషన్ నుంచి ఎలాంటి మద్దతు ఉండదు. మా నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తాయి” అని తన లేఖలో స్పష్టం చేసింది ఫిల్మ్ ఫెడరేషన్.






