8 August, 2026 | 2:14 AM

నా కోసం ఆయన ఇంటిని ఎప్పుడూ తెరిచే ఉంచాడు!

08-08-2026 12:00 AM

‘నిన్ను కోరి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండె గుడిలో చేరిపోయింది యువ కథానాయక నివేదా థామస్. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ అమ్మడును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డుతో గౌరవించంది. ‘35 చిన్న కథ కాదు’ చిత్రంలో ఆమె నటనకు గాను ఈ రాష్ట్రంలోనే కాక ఇటీవల నేషనల్ ఫిల్మ్ అవార్డు సైతం ఈ సినిమాకు దక్కింది.

అలా తాను భాగమైందంటే అవార్డులు, ప్రశంసలు పక్కా అనే నమ్మకాన్ని నిర్మాతలు, దర్శకులకు కలుగజేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ‘35 చిన్న కథ కాదు’ సినిమా నుంచి కెరీర్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా థామస్.. స్టార్ హీరో నానిపై ప్రశంసలు కురిపించింది “సాధారణంగా కొత్త భాషలో ఏదైనా సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఒంటరితననానికి లోనవుతాను.

కానీ, టాలీవుడ్‌లో మొదటి సినిమా చేసినప్పుడు అసలు నాకు అలాంటి భావన కలుగలేదు. నిజంగా ఈ విషయంలో నేను నానికి కృతజ్ఞురాలిని. ఆయనకు స్పెషల్‌గా థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే, అతను నా కోసం తన ఇంటిని ఎప్పు డూ తెరిచే ఉంచాడు. ఎలాంటి అవసరం వచ్చినా తొలుత నానిని సంప్రదించేదాన్ని. ఆయనతో అన్ని విషయాలూ షేర్ చేసుకునేదాన్ని. నాకు అంతటి చొర వ ఇచ్చారాయన.

నిజంగా అలాంటి మంచి గుణం నేను ఇంకెవరిలోనూ చూడలేదు” అంటూ నానిని ఆకాశానికెత్తేసింది నివేదా థామస్. నాని హీరో గా నటించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రంతోనే నివేదా థామస్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కూడా వీరిద్దరి కాంబోలో ‘నిన్ను కోరి’, ‘వీ’ వంటి సినిమాలు వచ్చి, ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.