ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను నియమించలేదు
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని బోయినిపేట లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లను నియమించలేదని లబ్ధిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు అసత్య ఆరోపణలు చేస్తున్న కౌన్సిలర్ పోతరబోయిన శ్రీలత క్రాంతి మతి బ్రమించి మాట్లాడుతున్నారని, వారు చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు గుండ రాజు, తీగల సమ్మయ్య, పోలు శివ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మంథని పట్టణంలోని ఆరో వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. మంథని మున్సిపాలిటీ పరిధిలో 13 వార్డులలో ఏ వార్డులో లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వినతి మేరకు 54 ఇండ్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించాడని వారు తెలిపారు.
నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని పూర్తి సహకారం అందిస్తామని, ఎవరైనా లబ్ధిదారులను బెదిరింపులు గురిచేస్తే తమ దృష్టికి తీసుకురావాలని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసమే అధికార కాంగ్రెస్ పార్టీని పార్టీ కార్యకర్తలను బ బదునం చేస్తున్నారని పోతారవేణి రాజయ్య, అట్టెం వినయ్, కొంతం శ్రీను, మోహన్, నాయని సంతు ఆరోపించారు.




