24 April, 2026 | 10:19 PM

జనగణన శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన తాసిల్దార్ ఉషా శారద

24-04-2026 08:48 PM

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న జనగణన శిక్షణ కార్యక్రమానికి తహసిల్దార్ మన్నే ఉషా శారద హాజరై పరిశీలించారు. జన గణనను పారదర్శకతతో చేయాలని అన్నారు. శిక్షణాకాలంలో పూర్తి విషయ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మూడు రోజుల శిక్షణను ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ ఉషా శారద, ఏఎస్ఓ జానీ మహమ్మద్, ఆర్పీలు నాగరాజు, సతీష్, పిఆర్టియు నాయకులు మదన్మోహన్ రెడ్డి, యుటిఎఫ్ కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.