18 July, 2026 | 12:41 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

వరి ధాన్యం కేంద్రం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

24-04-2026 08:26 PM

- రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం

కోహెడ: మండలంలోని శనిగరం ఐకెపి  కేంద్రాన్ని కలెక్టర్  హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా వరి ధాన్యo కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక్కడ లోడ్ చేసిన వరి ధాన్యంను బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం లోని శ్రీ లక్ష్మీ రైస్ మిల్ కు పంపిస్తున్నట్లు ఐకేపి సిబ్బంది కలెక్టర్ కు  చెప్పారు. ధాన్యం గ్రేడ్ విషయంలో సమస్యలు ఉన్నందున పరిష్కరించాలని రైతులు కోరగా అగ్రికల్చర్ అధికారులు వచ్చి ధాన్యం అంత పరిశీలన చేసి గ్రేడ్ కేటాయించేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

సెంటర్ లో తాగునీటి వసతి, కంఠాల, తాలు తీసే యంత్రాలు, గన్ని బ్యాగులు, సుతిల్ దారాలు ప్రతిదీ ఉండేలా చూసుకోవాలని, ధాన్యం తేమ శాతం వచ్చాక తాలు తీసాకే లోడ్ చేయించాలని సిబ్బందికి తెలిపారు. అలాగే రైతులు రాత్రి వేళలో ధాన్యం పైన టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచాలని అకాల వర్షాలు పడే ఆస్కారం ఉందని సూచించారు.