30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

బీహార్ సీఎంగా 20న నితీశ్ ప్రమాణ స్వీకారం

18-11-2025 12:12 AM

-పదోసారి ఆ కుర్చీ దక్కించుకున్న నేతగా రికార్డు

-పాట్నాలోని గాంధీ మైదానంలో వేడుక

-హాజరు కానున్న పీఎం మోదీ

పాట్నా, నవంబర్ 17: జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఈనెల 20న బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదోసారి సీఎం పీఠాన్ని అధిరోహించి సరికొత్త రికార్డును నెలకొల్పనున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ కూటమిలోని కీలక నేతలు హాజరు కానున్నారు.

కాగా, ఈమేరకు సోమవారం ఆయన గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను కలిసి, ప్రస్తుత అసెంబ్లీని నవంబర్ 19 నుంచి రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సమర్పించారు. మంగళవారం ఈ మేరకు ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కూటమి ఈ సమావేశంలో నితీశ్ కుమార్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం కొత్త కేబినెట్ ఏర్పాటుపై చర్చిస్తారు.