14 May, 2026 | 8:38 PM

పాఠశాలలను పరిశీలించిన ప్రత్యేక అధికారి

23-12-2025 03:54 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): జిల్లాలోని యాస్పిరేషనల్ బ్లాక్ అయిన పెంబి మండలంలోని నాగపూర్ ప్రాథమిక పాఠశాల, పెంబి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని నీతి అయోగ్ ప్రత్యేక అధికారిని శ్రీమతి శిల్పారావు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ దర్శనం భోజన్నతో కలిసి సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆమె కేజీబీవీ లోని చదువుతున్న బాలికలకు కల్పిస్తున్న సదుపాయాలు మరియు వారి యొక్క విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి, వారి సమాధానాల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యాస్పిరేషనల్ బ్లాక్ అయిన  పెంబి మండలంలోని పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.