2 July, 2026 | 3:00 AM

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిమ్స్ డైరెక్టర్‌కు సన్మానం

02-07-2026 01:35 AM

పంజాగుట్ట, జూలై 1 (విజయక్రాంతి): జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రా tvయల్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.సి.రాయ్ జయంతిని కూడా పురస్కరించుకొని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్, మెడికల్ జెనెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ ప్రజ్ఞా రంగనాథ్ లను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు ఎనలేనివన్నారు.

నిమ్స్ వైద్యులు ప్రతి ఏడాది వేలాది మంది రోగుల ప్రాణాలను నిలుపుతున్నారని కొనియాడారు. అత్యాధునిక చికిత్సా విధానాలతో ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్యులను మన పూర్వీకులు వైద్యో నారాయణో హరి అని పోల్చారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ మీడియా రిలేషన్స్ ఆఫీసర్ సత్యగౌడ్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ రాయల్స్ అధ్యక్షుడు లయన్ మోహన్ గడ్డం, కార్యదర్శి లయన్ శ్రీను ప్రశాంత్, కోశాధికారి లయన్ దివాకర్ దేపాల, జిల్లా చైర్మన్లు లయన్ ఆకుల రవీందర్ రావు, లయన్ వైలా శ్రీనివాస్ రావు, లయన్ మలెల్ల నర్సింగ్ రావు, లయన్ పోతాని గోపాల్, లయన్ కొండూరు నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.