13 April, 2026 | 4:51 AM

మోదీ నాయకత్వంలో నయాభారత్

13-04-2026 01:24 AM
  1. రక్షణ కోసం భద్రతా బలగాలు చేస్తున్న సాహసాలను తెలుసుకోవాలి
  2. ధురంధర్ సినిమాను డైరెక్టర్ అద్భుతంగా తీశారు
  3. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాం తి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నయాభారత్ ఏ విధంగా రూపొందుతుందో మనం చూస్తున్నామని, ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్థాన్‌ను ఎలా తిప్పి కొట్టామో చూశామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ కార్య కర్తలు, నాయకులతో కలిసి ధురంధర్ సినిమాను నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ థియేటర్‌లో కిషన్‌రెడ్డి చూశారు. అనంతరం మీడి యాతో ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ ఆది త్య చాలా అద్భుతంగా సినిమాను తీశారని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీశారని అభినందించారు.

సినిమా అంటే వినోదమే కాదని, ఒక బాధ్యత కూడా అనిపించేలా ఈ సినిమాను తీశారని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం భద్రత సిబ్బంది ఏవిధంగా పనిచేస్తున్నారో కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. భద్రతా దళాలు చేస్తున్న త్యాగాలను ఇందు లో చూపించారని, వారుచేస్తున్న సాహసాలను గొప్పగా చూపించారని తెలిపారు. స్వా తంత్య్రం వచ్చిన నాటినుంచి పాకిస్థాన్ భారతదేశంపై ఎలాంటి పన్నాగాలు చేస్తుందో, దేశసమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి చేస్తు న్న ప్రయత్నాలను సినిమాలో చక్కగా చూపించారని తెలిపారు.

దొంగ నోట్లు తరలించడాన్ని చక్కగా చూపించారని, భవిష్య త్తులో పాకిస్థాన్ ఇంకా కుట్రలు చేస్తూనే ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదన్నారు. భారత భూభాగంలోని ఒక ప్రాంతాన్ని విడదీసి పాకిస్థాన్ అనే శత్రువును తయారు చేసి పెట్టారని, ప్రతి ఒక్కరూ ధురంధర్ సినిమా చూడాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు దేశ రక్షణ కోసం అండగా నిలబడాలని, భద్రతాబలగాలు చేస్తున్న సాహసాలను తెలుసుకోవాలని కోరారు. సినిమాలో నటించిన నటీనటులు నటించలేదు.. జీవించారని కొనియాడారు.