1 April, 2026 | 1:08 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు

01-04-2026 12:00 PM
  1. వేతన జీవులకు ఉపశమనం..
  2. దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం..
  3. రూ. 4 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయింపు
  4. పొరపాట్ల సవరణకు 4 ఏళ్ల గడువు
  5. ఆదాయం  రూ. 24 లక్షలు దాటితే 30 శాతం పన్ను

న్యూఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా సరళమైన కొత్త ఐటీ చట్టం(New Income Tax rules) అమలులోకి వచ్చింది. నోటీసులు, అప్పీల్లు, వివాదాల పరిష్కారానికి ఫేస్ లెస్, ఏఐ ఆధారిత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఐటీ రిటర్న్స్ లో జరిమానా లేకుండా పొర పాట్ల సవరణకు 4 ఏళ్ల వరకు గడువు విధించారు. వేతన జీవులకు గణనీయమైన ఉపశమనం కల్పించేలా శ్లాబుల రూపకల్పన చేశారు.

సెక్షన్ 87ఏ ప్రకారం రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను మినహాయింపు కల్పించారు. కొత్త శ్లాబుల ప్రకారం రూ. 4 లక్షల వరకు పూర్తి పన్ను మినహాయించారు. రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షల వరక 5 శాతం పన్ను, రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ. 16 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ. 20 లక్షల నుంచి రూ. 24 లక్షల వరకు 25 శాతం పన్ను విధించనున్నారు. ఆదాయం రూ. 24 లక్షలు దాటితే 30 శాతం పన్ను విధించనున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.