లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
లోక్ సభ ముందుకు అమరావతికి చట్టబద్ధత బిల్లు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని(Amaravati Bill) అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగర ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అండను కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) బుధవారం నాడు లోక్‌సభలో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టింది. అమరావతికి చట్టబద్ధత బిల్లును హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్(Nityanand Rai) బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లుపై గంట సేపు చర్చించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla) అనుమతించారు. అవసరమైతే మరో గంట చర్చిద్దామని స్పీకర్ సూచించారు. అమరావతికి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది.
బిల్లుకు మద్దతిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్(Congress MP Manickam Tagore) వెల్లడించారు. రాజధాని అమరావతికి కేంద్రం సంపూర్ణంగా సహకరించాలని మాణికం ఠాకూర్ కోరారు. రాజధాని అమరావతికి తగినన్ని నిధులు అందించాలన్నారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి సహకరించాలని మాణికం ఠాగూర్(Manickam Tagore) కోరారు. తిరుపతిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర హామీ ఇంకా పెండింగ్ లోనే ఉందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా(AP Special Status) ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. రాజధాని అంశమే కాదు.. మిగిలిన హామీలు కూడా అమలు చేయాలన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాకూర్ కోరారు.




