22 April, 2026 | 9:37 PM

సంగమేశ్వర్ లో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం

22-04-2026 07:50 PM

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో బుధవారం బట్ట మంజుల, స్వామి నూతనంగా నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ గృహప్రవేశానికి సంగమేశ్వర్ గ్రామ కాంగ్రెస్ కమిటీని ఆహ్వానించడం జరిగింది ఇట్టి గృహప్రవేశానికి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు బహుకరించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పల్లె రామస్వామి గౌడ్, దోమకొండ మండల మాజీ వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి, సంగమేశ్వర్ గ్రామ అధ్యక్షులు నాయిని ప్రభాకర్ రెడ్డి, సంగమేశ్వర్ గ్రామ యూత్ అధ్యక్షులు బట్ట మనోహర్ , ఇందిరమ్మ ఇంటి కమిటీ మెంబర్స్ సడుగు సిద్ధ రాములు, శీలం అశోక్, పోచవ్వ, బట్ట స్వామి, కొమ్ము దశరథ , బట్ట చంద్రబాబు, చాకలి రామ్, బట్ట చిన్న స్వామి, తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బట్ట మంజుల స్వామి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి మరియు ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.