19 August, 2026 | 6:10 PM

నకిలీ నంబర్ ప్లేట్ వినియోగం.. కేసు నమోదు అరెస్ట్

19-08-2026 05:36 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని సోనాల గ్రామ శివారులో బజార్హత్నూర్ రోడ్డుపై పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నకిలీ నంబర్ ప్లేట్ తో తిరుగుతున్న కారును స్వాధీనం చేసు కోవడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. టీఎస్ జీరో వన్ ఈజే 41 78 నెంబర్ తో ఉన్న షిఫ్ట్ డిజైర్ కారును తనిఖీ చేయగా ఇంజన్ నంబర్ల ఆధారంగా అసలు రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 02 ఎఫ్జె 4178గా గుర్తించామన్నారు. వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చి అసలు గుర్తింపు దాచిన కడెం రాజు అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. నకిలీ నంబర్ ప్లేట్ ను వినియోగించడం చట్ట విరుద్ధమని ఇలాంటి వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అంతేగాక సోనాల గ్రామంలో నిర్వహించిన కార్టెన్ అండ్ సెర్చ్ లో నంబర్ ప్లేట్ లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహన దారులపై కేసులు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిఐడి గురుస్వామి ఎస్ఐ వి. పురుషోత్తం సిబ్బంది ఉన్నారు.