కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సునీల్ చవాన్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం జయరాం తాండ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా సునీల్ చౌవాన్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అందజేశారు. ఉపాధ్యక్షులుగా వినోద్ చౌవాన్ , ప్రకాష్, ప్రధాన కార్యదర్శులుగా గంగు, రుకీ బాయ్ రాథోడ్, కార్యదర్శులుగా మోహన్, హిరి బాయ్, సునీల్ దాతో పాటు మరో ఆరుగురిని కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షులు చవాన్ సునీల్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరేలా కృషి చేస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ నాయక్ మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.






