19 August, 2026 | 6:36 PM

పండుగ సాయన్న జయంతికి అధికారిక గుర్తింపు

19-08-2026 05:46 PM

బెజ్జంకి: పండుగ సాయన్న జయంతిని ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ముదిరాజుల సంఘం మండల అధ్యక్షుడు అక్కరవేని పోచయ్య ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి ముదిరాజ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ముదిరాజ్ సమాజం అభ్యున్నతి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.