22 April, 2026 | 9:38 PM

అక్కంపల్లి, తాండూరు గ్రామాలలో పశువైద్య శిబిరం

22-04-2026 07:52 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని అక్కంపల్లి తాండూర్ గ్రామాలలో పశువైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని మండల పశువైద్యాధికారి రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మండల పరిషత్ వైద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ... అక్కంపల్లి గ్రామంలో 85 తెల్ల పశువులకు, 14 గేదెలకు గాలికుంటు నివారణ టీకాలు వెయ్యడం జరిగిందన్నారు. తాండూరు గ్రామంలో 106 తెల్ల పశువులకు అలాగే 22 గేదెలకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. పశువుల పోషణపై రైతులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో  తాండూర్,అక్కంపల్లి గ్రామాల సర్పంచులు సర్పంచ్ వెంక గౌడ్,యాద గౌడ్,పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.